శంషాబాద్, వెలుగు: పాలమాకులలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఎనిమిదో తరగతి విద్యార్థి సబావత్ వెంకటేశ్ ఇన్ స్పైర్ అవార్డ్ మనక్ కు ఎంపికయ్యాడు. సైన్స్ ప్రాజెక్టులో భాగంగా సృజనాత్మకంగా ఆలోచించి విద్యుత్ షాక్ నుంచి మనుషులను, జంతువులను కాపాడే పరికరాన్ని రూపొందించాడు.
ఉపాధ్యాయిని ఫరీదా బేగం సాయంతో వెంకటేశ్ పరికరం తయారు చేసి ప్రదర్శించినందుకు అవార్డును పొందాడు. 84 ప్రాజెక్టులు పాల్గొనగా 8 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. వీటిలో పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రాజెక్ట్ కూడా ఉంది. రాష్ట్రస్థాయి స్కూల్ విద్యార్థి ప్రాజెక్ట్ ఎంపిక కావడంతో సంతోషంగా ఉందని పిన్సిపాల్ విష్ణుప్రియ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
