పల్లా, రాజయ్య తోడుదొంగలు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి

పల్లా, రాజయ్య తోడుదొంగలు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
  • అవినీతిని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా? 
  • నా బిడ్డ కులం గురించి మాట్లాడితే కేసు పెడతా 
  • స్టేషన్ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి

ధర్మసాగర్(వేలేరు), వెలుగు: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఇద్దరూ తోడు దొంగలని స్టేషన్ ఘన్​పూర్​ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వేలేరు మండలం షోడాశపల్లిలో వరంగల్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో ధర్మసాగర్, వేలేరు మండలాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘రాజయ్య ఓ దొంగ. దళితబంధు పేరిట అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వారిని అప్పుల పాలు చేశాడు.

 ప్రాధాన్యత లేదని బీఆర్ఎస్ ను వదిలి పోయి మళ్లీ అదే పార్టీలోకి వచ్చిన రాజయ్యకు...తీసుకున్న కేసీఆర్ కు సిగ్గులేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాదించాడు. మండలంలో రూ.104 కోట్ల నిధులతో మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకున్నాడు. పల్లా..నీ అవినీతిని నేను నిరూపిస్తా...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా’ అని సవాల్ విసిరారు. 

లిఫ్ట్ ఇరిగేషన్ లో తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ తెచ్చుకున్నాడని, మన ఊరు మనబడి కార్యక్రమంలో తమ్ముడికి కాంట్రాక్టు ఇప్పించి అవినీతికి పాల్పడ్డారన్నారు. తన కూతురి విషయంలో కులం ప్రస్తావన తెస్తే  కేసులు పెడతానని హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి, స్టేషన్ ఘన్​పూర్​ఇన్​చార్జి సింగపురం ఇందిర, ధర్మసాగర్ జడ్పీటీసీ పిట్టల శ్రీలత, వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రసాద్, సంపత్, అమరేందర్​రెడ్డి, కీర్తి వెంకటేశ్వర్లు, రాంగోపాల్ రెడ్డి, సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు. 

ఇందులో ధర్మసాగర్, వేలేరు మండలాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ‘రాజయ్య ఓ దొంగ. దళితబంధు పేరిట అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి వారిని అప్పుల పాలు చేశాడు. ప్రాధాన్యత లేదని బీఆర్ఎస్ ను వదిలి పోయి మళ్లీ అదే పార్టీలోకి వచ్చిన రాజయ్యకు...తీసుకున్న కేసీఆర్ కు సిగ్గులేదు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని రూ. వందల కోట్లు సంపాదించాడు.

 మండలంలో రూ.104 కోట్ల నిధులతో మంజూరైన లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కాంట్రాక్టర్ వద్ద కమిషన్ తీసుకున్నాడు. పల్లా..నీ అవినీతిని నేను నిరూపిస్తా...ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా’ అని సవాల్ విసిరారు. లిఫ్ట్ ఇరిగేషన్ లో తాను ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని యూనివర్సిటీ తెచ్చుకున్నాడని, మన ఊరు మనబడి కార్యక్రమంలో తమ్ముడికి కాంట్రాక్టు ఇప్పించి అవినీతికి పాల్పడ్డారన్నారు. 

తన కూతురి విషయంలో కులం ప్రస్తావన తెస్తే  కేసులు పెడతానని హెచ్చరించారు. టీపీసీసీ కార్యదర్శి, స్టేషన్ ఘన్​పూర్​ఇన్​చార్జి సింగపురం ఇందిర, ధర్మసాగర్ జడ్పీటీసీ పిట్టల శ్రీలత, వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రసాద్, సంపత్, అమరేందర్​రెడ్డి, కీర్తి వెంకటేశ్వర్లు, రాంగోపాల్ రెడ్డి, సద్దాం హుస్సేన్ పాల్గొన్నారు.