రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌గా పల్లా

రైతు సమన్వయ కమిటీ చైర్మన్‌గా పల్లా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రైతు సమన్వయ సమతి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో పల్లా మూడేళ్లపాటు కొనసాగుతారు. తనను రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా నియమించడంపై పల్లా సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా పల్లాకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. రాష్ట్రంలో రైతులను సంఘటితం చేయాలని, సమన్వయ సమితి లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని కోరారు. గతంలోనే రాజేశ్వర్ రెడ్డిని చైర్మన్‌గా నియమిస్తామని సీఎం ఆఫీసు నుంచి ప్రకటన వచ్చింది. కాని రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవి ఆఫీస్ ఆఫ్ బెనిఫిట్ పరిధిలోకి వస్తుందన్న కారణంగా ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వ ఆర్డినెన్స్‌లో సమన్వయ సమితి చైర్మన్ పదవిని ఆ పరిధిలోంచి మినహాయించారు. దీంతో ఎమ్మెల్సీ పల్లాను చైర్మన్‌గా నియమించారు.