తెలంగాణ పల్లె ప్రగతి.. రద్దు

తెలంగాణ పల్లె ప్రగతి.. రద్దు
  •  2015లో పథకం ప్రారంభం
  •  ఐదేళ్లకు రూ. 642 కోట్లతో అమలుకు  ప్లాన్
  •  ఏడాది ముందే క్యానిల్స్

మహబూబాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పల్లెలను ప్రగతిబాట పట్టించేందుకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో 2015 ఆగస్టు23న ఆనాటి  రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కేటీ రామారావు తెలంగాణ పల్లె ప్రగతి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఐదేళ్లపాటు ప్రపంచ బ్యాంకు సహకారంతో పథకం నిర్వహించాలనున్నా కాలపరిమితి ముగియక ముందే అర్ధంతరంగా రద్దు చేశారు. ప్రపంచబ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వ వాటా కలుపుకొని ఈ పథకం కింద ఐదేండ్లలో రూ. 642 కోట్లు ఖర్చు చేయాలనుకున్నారు. తెలంగాణలోని అత్యంత వెనుకబడిన 150 మండలాల్లో ప్రగతికి బాటలు వేయడానికి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న బలహీన వర్గాలకు చెందిన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు చేయూతనివ్వడానికి పల్లెప్రగతి కార్యక్రమం రూపొందించారు. కార్యక్రమ అమలుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ద్వారా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు. 150 మండలాల్లోని దాదాపు 74 లక్షల కుటుంబాలు దారిద్య్రంలో మగ్గుతున్నాయని, ఆ కుటుంబాల్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలే ఉండడంతో  పల్లెప్రగతి కోసం తెలంగాణలో కొత్తగా 2.75 లక్షల ఉత్పత్తిదారుల మహిళా సంఘాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇచ్చే చేయూతకు తోడుగా ఈ సంఘాలు రూ. 50 వేల చొప్పున వేసుకున్నట్లయితే దాదాపు రూ. వెయ్యి కోట్లకు పైగా సమకూరతాయని అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలు పెరగాలని, పల్లెప్రగతి ద్వారా గ్రామీణ మహిళలు గొర్రెలు, బర్రెలు, మేకలు, కోళ్లు పెంచుకోవచ్చని, కూరగాయ పంటలు సాగు చేసుకోవచ్చునని తెలిపారు. ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి, నెలకు రూ.5 వేలు సంపాదించుకునే వారు రూ.10 వేలు సంపాదించుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

150 నుంచి 260 మండలాలకు…

ఆదిలాబాద్​ జిల్లాలో 30 మండలాలు, కరీనంగర్, ఖమ్మం17, మహబూబ్​నగర్, మెదక్, నల్లగొండ 13, నిజామాబాద్, రంగారెడ్డి 9, వరంగల్​18 ఇలా మొత్తంగా 150 వెనుకబడిన మండలాల పరిధిలో పల్లె ప్రగతి పథకం అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన తరువాత 260 మండలాలకు  వర్తింపజేయాలని సంకల్పించారు. ఐకేపీలో పని చేస్తున్న సిబ్బందికి పరీక్ష నిర్వహించి పల్లె ప్రగతిలో పని చేసేందుకు ఎంపిక చేశారు. వారికి నెలకు రూ. 5 వేల వేతనం అదనంగా అందించారు. 2015లో ప్రారంభించిన పల్లెప్రగతి పథకం ఐదేళ్లపాటు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నా  కాల పరిమితికి ముందే రద్దు చేస్తూ సెర్ప్​చీఫ్​ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్​ పౌసమి బసు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్​ లెవల్లో 527 మంది సిబ్బంది, జిల్లా స్థాయిలో 36 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది ముందుగానే పథకం రద్దు చేయడంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనిపై సెర్ప్ రాష్ట్ర  స్థాయి డైరెక్టర్​ను వివరణ కోరగా పథకం రద్దు చేసింది వాస్తవమేనని,  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఆర్థిక సహకారం ఇలా…

పల్లె ప్రగతి కార్యక్రమానికి ఐదేండ్లకు ప్రపంచ-బ్యాం కు రూ.450 కోట్ల రుణం ఇవ్వనుం డగారాష్ట్రం ప్రభుత్వం మరో రూ.192 కోట్లు సమ-కూర్చాలి. మొత్తంగా రూ.642 కోట్లతో నిర్వ-హించాలనుకున్నారు . పల్లెప్రగతి ద్వారా 150మండలాల్లోని గ్రామ పంచా యతీల ఆవరణలోపల్లె సమగ్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.ప్రస్తు తం మీ సేవా కేంద్రాల ద్వారా పొందు-తున్న అన్ని రకాల సర్టిఫికెట్లను పల్లె ప్రజలుఈ కేంద్రాల వద్దే తీసుకునే వెసు లుబాటుకల్పించారు . టెలిఫోన్, కరెంట్ బిల్లు లు సహాఅన్ని బిల్లు లు అక్కడే కట్టుకోవచ్చు. రాబోయేరోజుల్లో ఉపాధి హామీ వేతనాలు, పింఛన్లుకూడా వీటి నుంచే అందించాలని అప్పట్లో ఆలోచన చేశారు.