
హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలతో కాంగ్రెస్ నేత, పాల్వాయి స్రవంతి హైదరాబాద్లో సమావేశమయ్యారు. మునుగోడు నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ పాల్వాయి స్రవంతి.. తదుపరి కార్యాచరణపై నియోజవర్గ కాంగ్రెస్ నేతలు కైలాష్ నేత, కార్యకర్తలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ను మోసం చేసి వెళ్లిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి టికెట్ ఇవ్వడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత అన్నారు. భవిష్యత్ కార్యచరణపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. అయితే మునుగోడు కాంగ్రెస్లో కీలక నేతలు అయిన పాల్వాయి స్రవంతి, కైలాష్ నేత త్వరలో బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.
ALSO READ :కాంగ్రెస్ను గెలిపిస్తే ..దొంగచేతికి తాళాలిచ్చినట్లే: మంత్రి జగదీష్రెడ్డి