బ్యాడ్ లక్.. ఐదో పెళ్లి పెటాకులే.. 12 రోజులకే భర్తకు దూరం

బ్యాడ్ లక్.. ఐదో పెళ్లి పెటాకులే.. 12 రోజులకే భర్తకు దూరం

పెళ్లి చేసుకోవడానికి రెండు కుటుంబాలు కావాలేమో కానీ విడాకులు తీసుకోవడానికి చిన్న కారణం చాలు. పెళ్లి తర్వాత చిన్న మనస్పర్థలు వస్తే చాలు డైవర్స్ తీసుకుంటున్నారు. ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. లేటెస్ట్ గా హాలీవుడ్ నటి  పమేలా ఆండర్సన్ పెళ్లైన 12 రోజులకే ఆమె భర్తను వదిలేసి షాకిచ్చింది.  పమేలా ఆండర్సన్  ప్రముఖ ప్రొడ్యూసర్  జోన్ పీటర్స్ ను జనవరి 20  న పెళ్లి చేసుకుంది. తర్వాత చిన్న కారణంతో జోన్ పీటర్స్ ను వదిలేసింది. పమేలా ఆండర్సన్, జోన్ పీటర్స్ ఇద్దరికి ఇది ఐదవ పెళ్లి. పమేలా వయసు (52). ఇద్దరం ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నామని.. అయితే  తమకు ఒకరిపైఒకరికి క్లారిటీ లేనందున దూరంగా ఉంటున్నామని మీడియాతో చెప్పింది.