పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేసుకుంటే ప్యాన్ ఇండియా అయిపోదు

పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేసుకుంటే ప్యాన్ ఇండియా అయిపోదు

గతంలోనూ కొన్ని సినిమాల్లో కామెడీ చేసినా వాటన్నింటికీ భిన్నమైన స్టైల్‌‌‌‌‌‌‌‌లో నటించాను. నేను పాత నానిలా చేద్దామని ట్రై చేసినా వివేక్ రైటింగ్ చేయనివ్వలేదు. అలా రాశాడు. హిలేరియస్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. కొత్త నాని, కొత్త టైమింగ్‌‌‌‌‌‌‌‌తో కనిపిస్తాను. నేను పోషించిన బ్రాహ్మణ కుర్రాడి పాత్ర కూడా రియలిస్టిక్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. వివేక్‌‌‌‌‌‌‌‌ తన లైఫ్‌‌‌‌‌‌‌‌లో ఏం చూశాడో దాన్నే అథెంటిక్‌‌‌‌‌‌‌‌గా చూపించాడు. 

నెగిటివ్‌‌‌‌‌‌‌‌ షేడ్‌‌‌‌‌‌‌‌ ఉన్న పాత్ర చేయడం కాస్త కష్టమేమో కానీ ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌గా కనిపించడం నాకు చాలా ఈజీ. సుందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి మందు, సిగరెట్స్ లాంటి అలవాట్లు లేవు, ఈ ఒక్క విషయంలో తప్ప అతన్ని ఎందులోనూ ఫాలో అవ్వొద్దని స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై హెచ్చరిక వస్తుంది. ట్రైలర్ చూసినా అతను చాలా ఇన్నోసెంట్‌‌‌‌‌‌‌‌ అనుకుంటాం. కానీ ఇన్నోసెంట్ అయిన కన్నింగ్ ఫెలో. అయినా కూడా ప్రతి ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులు అతన్ని ప్రేమిస్తారు. 
 ఇది కేవలం హీరో కథ కాదు. అందుకే టైటిల్‌‌‌‌‌‌‌‌లో నాని, నజ్రియా కలిసి నటించిన అని పెట్టాం. ఒకరి పేరే పెడితే తప్పవుతుంది. లీలా థామస్ పాత్రకి ఎవరైతే బాగుంటుందని మాట్లాడుకున్నప్పుడు నజ్రియా లాంటి వారిని తీసుకుందామనుకున్నాం. అలాంటి వారెందుకు, తననే తీసుకుందామని అప్రోచ్ అయితే కథ నచ్చి వెంటనే ఓకే చెప్పింది. 
 బారిస్టర్ పార్వతీశానికి ట్రిబ్యూట్‌‌‌‌‌‌‌‌ లాంటి ఓ సీన్ ఉంది తప్ప ఆ నవలకీ, దీనికీ సంబంధమే లేదు. కొన్ని సినిమాల్లో నిండుదనం కోసమే ఎక్కువమంది నటీనటుల్ని పెట్టినట్టు ఉంటుంది తప్ప కొందరికి డైలాగ్స్ కూడా ఉండవు. కానీ ఇది అలా కాదు. ప్రతి పాత్ర ప్రేక్షకులకి గుర్తుండిపోతుంది.
 ఇలాంటి బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కిన మరోచరిత్ర, సీతాకోకచిలుక లాంటివన్నీ ఇంటెన్స్ సినిమాలు. ఇది చాలా లైట్ హార్టెడ్ మూవీ. వాటితో ఎలాంటి పోలికలూ లేవు. రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లో లేనట్టు ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చూపిస్తే కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. కానీ వాళ్ల సెన్సిబిలిటీస్‌‌‌‌‌‌‌‌ను నిజ జీవితానికి దగ్గరగా చూపించాం కనుక అలాంటి ఇబ్బందులు రావు. 
 లీడింగ్‌‌‌‌‌‌‌‌లో డైరెక్టర్స్ కంటే ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లీడింగ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చే డైరెక్టర్స్‌‌‌‌‌‌‌‌తో చేస్తే వాళ్ల జర్నీలో మనమూ ఒక పార్ట్ అవ్వొచ్చనేది చిన్న స్వార్థం. వివేక్‌‌‌‌‌‌‌‌ ఆత్రేయను కలిసినప్పుడు, తన సినిమాలు చూసినప్పుడు, మనం భవిష్యత్తులో చూడబోయే ఓ టాప్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే నమ్మకం కుదిరింది. తనకంటూ ఒరిజినల్ స్టైల్ ఉంది.  అది తన ప్రతి సినిమాలోనూ కనబడుతుంది. తన సినిమా కథను ఇంకెవరికిచ్చినా తనలా తీయలేరు. 
  మహేష్ బాబు, విజయ్, ప్రశాంత్ నీల్.. వీళ్ల సినిమాల్లో నటిస్తున్నానంటూ రోజుకో రూమర్ వస్తోంది. ఇప్పుడు నా కొత్త సినిమా అనౌన్స్‌‌‌‌‌‌‌‌మెంట్ వచ్చినా నమ్ముతారో లేదో! ప్రస్తుతం ‘దసరా’ చేస్తున్నాను. ఇరవై ఐదు శాతం షూటింగ్ పూర్తయింది. తర్వాతి సినిమా కోసం కొన్ని సబ్జెక్ట్స్‌‌‌‌‌‌‌‌ లైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి.  ఫైనల్ అవ్వగానే అనౌన్స్ చేస్తాను. ఇక నేను నిర్మిస్తున్న ‘మీట్ క్యూట్’ ఓటీటీలో రానుంది. జులై 29న ‘హిట్ 2’ రిలీజ్ చేయనున్నాం. ఈ  ఫ్రాంచైజీలో మొత్తం ఏడు సినిమాలున్నాయి. 
 ఇండియన్ సినిమాకిది గోల్డెన్ ఫేజ్. ఏ ప్రాంతానికి చెందినదని కాకుండా మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌తో వస్తే  ప్యాన్‌‌‌‌‌‌‌‌ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌ సక్సెస్ అవుతోంది. ‘పుష్ప’ సినిమా నార్త్‌‌‌‌‌‌‌‌కి ఏమాత్రం సెట్ కాని సౌత్ నేటివిటీతో వచ్చినా కంటెంట్ నచ్చింది కనుక అక్కడా బ్లాక్‌‌‌‌‌‌‌‌బస్టర్ అయ్యింది. కంటెంట్ గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌గా ఉండటమే అందుకు కారణం. ‘ప్యాన్ ఇండియా’ అంటే ప్రేక్షకులు ఇచ్చే స్టేటస్ తప్ప, మనకు మనం పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వేసుకునేది కాదు. 
 అతి తక్కువ టికెట్ రేట్స్ ఉన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఎలా సర్వైవ్ అవుతారని, బేసిక్ రేట్ పెంచమని అడిగాను. ఆ రేటు ఐదొందలైనప్పుడు నేను పెంచమన్నదిదే అంటున్నారు. నేనడిగింది ఇది కాదే. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి పెద్ద చిత్రాలకు తప్ప మిగతా వాటికి పెంచడం కరెక్ట్ కాదు.  నేనడిగింది బేసిక్ రేట్లు మాత్రమే.

 

ఇవి కూడా చదవండి

ఆ జిల్లాలపై టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి

వేల లీటర్ల పాలు సేకరించి, లక్షల లీటర్ల తయారీ