- వికారాబాద్ జిల్లా గోట్లపల్లి క్లస్టర్‌లో ఘటన
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలోని గోట్లపల్లి క్లస్టర్ పరిధిలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ పేపర్లు చోరీకి గురయ్యాయి. ఎన్నికల్లో భాగంగా గోట్లపల్లి, గిర్మాపూర్, జయరాంతండా పంచాయతీలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్లు తీసుకున్న ఆఫీసర్లు వాటిని గొట్లపల్లి పంచాయతీ ఆఫీస్‌లో భద్రపరిచారు.
బుధవారం ఉదయం పంచాయతీ ఆఫీస్ తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా.. నామినేషన్ పేపర్లు కనిపించలేదు. విషయం తెలుసుకున్న తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్‌ప్రసాద్, డీఎస్పీ నర్సింగ్ యాదయ్య గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. చోరీ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.
