V6 News

పోలింగ్ విధులపై అలర్ట్ : ఫణీంద్రారెడ్డి

పోలింగ్ విధులపై అలర్ట్ : ఫణీంద్రారెడ్డి

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఫణీంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జయశంకర్​భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ఫణీంద్రారెడ్డి మాట్లాడారు. జిల్లాలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ పరిశీలకులు విధులు ముఖ్యమైనవన్నారు. పోలింగ్ కేంద్రాల్లోని ప్రతి చర్యను నిశితంగా పరిశీలించాలని, ఏ పరిస్థితుల్లోనూ పోలింగ్ నిర్వహణలో జోక్యం చేసుకోకూడదని సూచించారు. 

అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు నివేదించాలని మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత ముఖ్యమని చెప్పారు. 52 మంది సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ విజయలక్ష్మి, వ్యయ పరిశీలకులు రవి, డీపీవో శ్రీలత, ఎల్డీఎం తిరుపతి, డీఈవో రాజేందర్, మాస్టర్ ట్రైనర్లు రామయ్య, తిరుపతి పాల్గొన్నారు.