V6 News

పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించండి : మంత్రి సీతక్క

పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించండి : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపించాలని పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క ఓటర్లను కోరారు. శుక్రవారం ములుగు జిల్లాలోని వెంకటాపూర్, మల్లంపల్లి, ములుగు మండలాల్లోని ఆయా గ్రామాల్లో మంత్రి పర్యటించి కాంగ్రెస్​పార్టీ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. 

తెలంగాణ ప్రజాప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. రెండో దశ ఎన్నికల ప్రచారం చివరిరోజు కావడంతో ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.