పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేయాలి

పంచాయతీ సెక్రటరీలను బదిలీ చేయాలి

హైదరాబాద్ ,వెలుగు :  లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ రాజ్ లోని అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం సెక్రటరీలను ఎందుకు బదిలీ చేయటం లేదని పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, వాణి, పండరినాధ్ లు కోరారు. ఎంపీవో, ఎంపీడీవో, డీపీవో, జడ్పీ సీఈవో, డీఎల్​పీవో ఇలా అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేశారని ఓ పత్రిక ప్రకటనలో తెలిపారు.

 పంచాయతీ సెక్రటరీలు చాలా మంది 5 ఏండ్ల నుంచి ఒకే దగ్గర చేస్తున్నారని, వీరిని బదిలీ చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు ఇవ్వాలన్నారు. నారాయణ పేట జిల్లాలో అక్కడి కలెక్టర్ 23 మంది  సెక్రటరీలను బదిలీ చేశారని, ఇలాగే రాష్ర్టమంతా చేయాలని పేర్కొన్నారు. ఎన్నికల బదిలీలు రాష్ర్టమంతా చేయకుండా ఒక్క జిల్లాకే పరిమితం చేయటం ఏంటని నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోని బదిలీలు చేపట్టాలన్నారు.