
వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్తో సడెన్గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. గతంలో 50 ఏళ్లు దాటినవారిలో ఎక్కువగా గుండెపోటు మరణాలు చూసేవాళ్లం. కరోనా తర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి.
మే 28న మంచిర్యాల జిల్లా జన్నారంలో కుర్చీలోనే కుప్ప కూలిండు పంచాయతీ సెక్రటరీ. గుండెపోటుతో కుర్చీలోనే ప్రాణాలు విడిచాడు పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి. కుటుంబ సభ్యులతో కుర్చీలో కూర్చోని మాట్లాడుతుండగా గుండెపోటుతో కిందపడిపోయాడు.ఉన్నట్టుండి కళ్లముందే చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. పంచాయితీ కార్యదర్శి చంద్రమౌళిది జగిత్యాల జిల్లా. జాబ్ కోసం ఫ్యామిలీతో మంచిర్యాల జిల్లాలో నివాసం ఉంటున్నాడు.
దేశంలో గుండె, ఊపిరితిత్తుల సంబంధ మరణాలు తెలంగాణలోనే అత్యధికంగా సంభవిస్తున్నాయి. ప్రధానంగా వయసుతో సంబంధం లేకుండా సడెన్ కార్డియాక్ అరెస్ట్ (ఎస్ సీఏ) వస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి.