వచ్చే 10 ఏళ్లలో మరో మహమ్మారి.. : ఎయిర్‌ఫినిటీ అంచనా

వచ్చే 10 ఏళ్లలో మరో మహమ్మారి.. : ఎయిర్‌ఫినిటీ అంచనా

కరోనా కేసులు రోజురోజుకూ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైరస్ వల్ల వచ్చే వ్యాధులు మరింత ప్రమాదకరంగా మారనున్నాయని ఆరోగ్య విశ్లేషణ సంస్థ ఎయిర్‌ఫినిటీ హెచ్చరించింది. వచ్చే 10ఏళ్లలో కరోనా లాంటి ఎన్నో వైరస్ లు ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది . వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న జనాభా, జూనోటిక్ వ్యాధుల వల్ల ముప్పు ఈ ప్రమాదానికి దోహదపడుతుందని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్ తెలిపింది. కానీ వ్యాక్సిన్ లను కనుగొన్న100 రోజుల తర్వాత కరోనా మహమ్మారి 8.1%కి పడిపోయిందని చెప్పింది.

మానవుని నుంచి మానవునికి వచ్చే బర్డ్ ఫ్లూ రకం వైరస్ UKలో ఒకే రోజులో 15,000 మందిని చంపగలదని ఎయిర్‌ఫినిటీ తెలిపింది. ప్రపంచం ఇప్పుడు కోవిడ్-19తో కలిసి పయనిస్తున్నారని.. గత రెండు దశాబ్దాలుగా SARS, MERS, Covid-19 లకు కారణమయ్యే మూడు ప్రధాన కరోనావైరస్లు, దాంతో పాటు 2009లో అల్లకల్లోలం సృష్టించిన స్వైన్ ఫ్లూ మహమ్మారి సైతం కలకలం రేపిందని చెప్పింది.

H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పటికే ఆందోళనలను రేకెత్తిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకు తక్కువ సంఖ్యలో మాత్రమే వ్యాధి బారిన పడినప్పటికీ .. ఇది మానవుని నుంచి మానవునికి వ్యాపించే సంకేతాలు ఎక్కడా కనుగొనబడలేదు. పక్షుల, క్షీరదాల వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండడం రీసెంట్ డేస్ లో ఆందోళన కలిగిస్తోంది.

MERS,  జికా వంటి అనేక చాలా -ప్రమాదకరమైన వ్యాధికారక వ్యాక్సిన్‌లు, చికిత్సలు ఇప్పటివరకు ఆమోదించబడలేదు. ఇప్పటికే ఉన్న నిఘా విధానాలు కొత్త మహమ్మారిని సకాలంలో గుర్తించే అవకాశం లేదు. కాబట్టి మహమ్మారిల సంసిద్ధత చర్యలకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఎయిర్‌ఫినిటీ స్పష్టం చేసింది.