పేద దేశాలకు వ్యాక్సిన్లు అందకపోవడం వల్లే కొత్త వేరియంట్లు

పేద దేశాలకు వ్యాక్సిన్లు అందకపోవడం వల్లే కొత్త వేరియంట్లు

డబ్ల్యూహెచ్​వో: కొత్త ఏడాదిలో కరోనాను ఓడిస్తామని నమ్మకం ఉందని డబ్ల్యూహెచ్​వో చీఫ్​ టెడ్రోస్​ అధనామ్​ పేర్కొన్నారు. వైరస్​ మహమ్మారిపై పోరాడేందుకు ఇప్పుడు వ్యాక్సిన్లు సహా ఎన్నో ఆయుధాలు అందుబా టులోకి వచ్చాయని ఆయన చెప్పారు. ఈ ప్రయత్నంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటిగా కలిసి నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశా రు. కొన్ని పేద దేశాలకు సరిపడా వ్యాక్సిన్లు అందకపోవడం వల్లే ఒమిక్రాన్​ వంటి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయని చెప్పారు. అందుకే వ్యాక్సిన్లు తయారు చేస్తున్న దేశా లు సంకుచిత భావం వదిలేయాలని, టీకాల పంపిణీలో అన్ని దేశాలకూ సమాన ప్రాధా న్యం దక్కాలని టెడ్రోస్​ అన్నారు.