ఐసీయూలో క‌రోనా పేషెంట్ పెళ్లి..అండ‌గా నిలిచిన డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది.

ఐసీయూలో క‌రోనా పేషెంట్  పెళ్లి..అండ‌గా నిలిచిన డాక్ట‌ర్లు, ఆస్ప‌త్రి సిబ్బంది.

ప్ర‌పంచ దేశాల‌కు చేదు అనుభ‌వాల్ని క‌రోనా వైర‌స్ తో ప్ర‌జ‌లు ధైర్యంగా పోరాడుతున్నారు. అందుకే నిద‌ర్శ‌న‌మే ఈ ఘ‌ట‌న. అమెరికాలో టెక్సాక్ కు చెందిన కార్లోజ్ మునిజ్ కు క‌రోనా సోకి ఆస్ప‌త్రి ఐసీయూ లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు.

అయితే క‌రోనా సోకముందు గ్రేస్ అనే యువ‌తితో వివాహం నిశ్చ‌య‌మైంది. మ‌రికొద్దిరోజుల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. కానీ అంతలోనే మాయ‌దారి మహ‌మ్మారి సోకి కార్లోజ్ ఆస్ప‌త్రి పాల‌య్యాడు.

అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ఆస్ప‌త్రిలో జాయిన్ అయిన బాధితుడికి కండీష‌న్ సీరియ‌స్ కావ‌డంతో ఐసీయూలో ఉంచి ట్మీట్మెంట్ చేస్తున్నారు డాక్ట‌ర్లు. రోజులు గ‌డిచే కొద్ది బాధితుడిలో వైర‌స్ పూర్తిగా త‌గ్గింది. కానీ ఆరోగ్యం మాత్రం పూర్తిగా క్షీణించింది. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

ఈ క్ర‌మంలో వివాహం నిశ్చ‌య‌మైన యువ‌తిని ఐసీయూలో వివాహం చేసుకున్నాడు. డాక్ట‌ర్లు, సిబ్బంది స‌హ‌కారంతో బాధితుడు కార్లోజ్ గ్రేస్ ను వివాహం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

మ‌నో బ‌లం ముందు క‌రోనా ఏం చేయ‌లేదని నిరూపించిన కార్లోజ్ మ‌రికొద్దిరోజుల్లో ఆస్ప‌త్రినుంచి డిశ్చార్జ్ అవుతాన‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నాడు.