లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు

లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో పేలుడు

పంజాబ్‌లోని లూథియానా జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో గురువారం (జూన్ 8వ తేదీన) పేలుడు కలకలం రేపింది. పార్కింగ్ ప్రాంతంలో పేలుడు సమయంలో భారీ శబ్ధం వినిపించడంతో స్థానికులు పరుగులు తీశారు. కొంతమంది ఏం జరిగిందోనని భయపడ్డారు. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 

పేలుడుకు దారి తీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ చేపట్టారు. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు చెత్తను ఊడ్చి.. దానికి నిప్పంటించడంతో అది పేలిందని పోలీసు అధికారులు తెలియజేశారు. దీని వెనుక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. చెత్తలో ఉన్న కొన్ని గాజు సీసాలు పగిలి.. అది పేలుడుకు దారితీసిందన్నారు. 

డిసెంబర్ 23, 2021న లూథియానా కోర్టు కాంప్లెక్స్‌లో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఒక వ్యక్తి మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేసి.. ఐఈడీని డ్రోన్ ద్వారా సరిహద్దుల్లోకి తరలించింది.