P&G కొత్త సీఈవో శైలేష్ జెజురికార్.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థే తెలుసా..?

P&G కొత్త సీఈవో శైలేష్ జెజురికార్.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థే తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా అనేక దిగ్గజ కంపెనీలకు ప్రస్తుతం సీఈవోలుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది భారతీయ వ్యక్తులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యూఎస్ ఎఫ్ఎంసీజీ దిగ్గజం ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థకు కొత్త సీఈవోగా ఎంపికైన వ్యక్తి శైలేష్ జెజురికార్. ఆయన హైదారాబాదులో ప్రసిద్ధి గాంచిన HPS పూర్వ విద్యార్థి, పైగా నాయకత్వ స్థాయికి చేరుకున్న తొలి వ్యక్తి. 

187 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ సంస్థను ముందుకు నడిపించే బాధ్యతలు స్వీకరించిన ఆయన 1989 నుంచి అదే సంస్థలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం సీఈవోగా బాధ్యతలు చేపట్టడానికి ముందు కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయన బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 1984 బ్యాంచ్ పూర్వపు విద్యార్థి. శైలేష్ నాయకత్వ స్థాయి బాధ్యతలు చేపట్టడంపై HPS సొసైటీ అధ్యక్షుడు గుస్తి నోరియా హర్షం వ్యక్తం చేశారు. సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, ప్రేమ్ వాట్సా, అజయ్ బంగా వంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రముఖుల చెందన శైలేష్ చేరటంపై గుస్తి నోరియా సంతోషం వ్యక్తం చేశారు. 

ALSO READ :ట్రంప్ టారిఫ్స్: ఇప్పుడు ఏ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ బెస్ట్.. తెలుసుకోండి ఇన్వెస్టర్స్!

ప్రాక్టర్ & గాంబుల్ సీఈవోగా ఎంపికైన శైలేష్ జెజురికర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కమ్యూనిటీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో తను గడిపిన సమయం.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. తన సహచరులు, అధ్యాపకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.