
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్మున్సిపల్పరిధిలోని నూతన కాలనీల్లో మౌలిక వసతులను కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మున్సిపల్మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి తెలిపారు. ఆదివారం మున్సిపల్పరిధిలోని 17వ వార్డు ఆర్ఆర్హోమ్స్ కాలనీలో సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపాల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.