కొత్త కో- ఆపరేటివ్​ పాలసీ రెడీ

కొత్త కో- ఆపరేటివ్​ పాలసీ రెడీ

కోల్‌‌కతా: కొత్త కోఆపరేటివ్‌‌  పాలసీ రెడీ అయిందని, 47 మంది మెంబర్లతో కూడిన కమిటీ త్వరలో డ్రాఫ్టును కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుందని పానెల్​ చైర్మన్​ సురేష్​ ప్రభు వెల్లడించారు. దేశంలో కోఆపరేటివ్​ మూవ్​మెంట్​ను పటిష్టం చేసేందుకు ఒక కొత్త పాలసీ తేనున్నట్లు కిందటేడాదే కోఆపరేషన్​ మినిస్టర్​ అమిత్​షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఏర్పాటు చేసిన కమిటీకి సురేష్​ ప్రభు నాయకత్వం వహించారు. 
కోఆపరేటివ్​ రంగంలోని నిపుణులు, ఆ రంగపు ప్రతినిధులతోపాటు, వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు పానెల్​లో భాగంగా ఉన్నారు.  పాలసీ డాక్యుమెంట్​ దాదాపుగా పూర్తయిందని, ప్రభుత్వానికి అందచేయనున్నామని సురేష్​ ప్రభు చెప్పారు. ఆ తర్వాత దీనిని అమలులోకి తెస్తారని పేర్కొన్నారు. మర్చంట్స్​ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​ అండ్​ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సురేష్​ ప్రభు పాల్గొన్నారు.