
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఈ యేడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఢంకా మోగిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్ అన్నారు. బీజేపీ దూకుడుకు తృణమూల్ కాంగ్రెస్ భయపడుతోందని, ఆ భయమే తమను గెలిపిస్తుందన్నారు. అధికార తృణమూల్‌కు తాము నెగ్గలేమని అర్థమైందన్నారు. బెంగాల్‌లో మార్పు రాబోతోందని, ఇది నిజమన్నారు. బెంగాల్ ప్రజలు తమకు మమతా బెనర్జీ అక్కర్లేదని భావిస్తున్నారని, వారికి కావాల్సింది బీజేపీనని స్పష్టం చేశారు.