పానీపూరీ టర్నోవర్ రూ.6 వేల కోట్లు.. అందుకే గూగుల్ సెలబ్రేషన్స్

పానీపూరీ టర్నోవర్ రూ.6 వేల కోట్లు.. అందుకే గూగుల్ సెలబ్రేషన్స్

డూడుల్ జూలై 12న పానీ పూరీ డే సందర్భంగా ఇంటరాక్టివ్ గేమ్ ని పరిచయం చేసింది. దక్షిణాసియాలో ఎంతో పాపులర్ అయిన ఈ స్ట్రీట్ ఫుడ్ లో చాలా రకాలున్నాయని, పానీ పూరీ ప్రాముఖ్యాన్ని తెలియజేసింది డూడుల్. అయితే గూగుల్ పానీ పూరీ డేని ఎందుకు జకుపుకుంటంది అన్న విషయానికొస్తే..

గూగుల్ బ్లాగ్ పోస్ట్ ప్రకారం, 2015లో ఈ రోజున మధ్యప్రదేశ్ లోని ఇండోరి జైకా అనే రెస్టారెంట్ తన కస్టమర్లకు 51రకాల ప్రత్యేకమైన పానీ పూరీలను అందించి రికార్డు సృష్టించింది. అందుకు గుర్తుకు గూగుల్ ఈ రోజును సెలబ్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

భారతదేశంలో వివిధ వెరైటీలతో లభ్యమవుతోన్న పానీ పూరీని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లలో పానీ పూరీ అని పిలవగా.. ఉత్తర భారత రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూ, కాశ్మీర్, న్యూఢిల్లీలో దీన్ని గోల్ గప్పా అని అంటారు. ఇక పశ్చిమ బెంగాల్, బిహార్, జార్ఖండ్ వంటి ప్రాంతాల్లో దీన్ని పుచ్కాస్ అని పులుస్కారు.

ALSOREAD :ఇది జిలేబీనే.. గ్రీన్ కలర్ కొత్తగా..

దేశంలోనే అత్యంత నోరూరించే ఈ చిరుతిండి గురించి చాలా మందికి తెలియని మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. ఎన్బీటీ ప్రకారం దీని మార్కెట్ విలువ రూ.6కోట్ల కంటే ఎక్కువట. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక గంటలో 4వేల పూరీలు తయారు చేయవచ్చు. వీటితో కనీసం రూ.8 నుంచి 9వందల వరకు సులభంగా సంపాదించవచ్చు. వ్యాపారులు గనక 8గంటలు పానీ పూరీ బిజినెస్ చేస్తే రోజుకు రూ.6 నుంచి 7వేల వరకు సంపాదించవచ్చు. అంటే ఎంత ఎక్కువ కృషి చేస్తే పానీ పూరీ వ్యాపారంలో అంత ఎక్కువ సంపాదిస్తారన్నమాట.