ఇది జిలేబీనే.. గ్రీన్ కలర్ కొత్తగా..

ఇది జిలేబీనే.. గ్రీన్ కలర్ కొత్తగా..

జిలేబీ అంటే రెడ్ కలర్ లో ఉంటుంది.. ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇదే.. ఇక నుంచి జిలేబీ అంటే గ్రీన్ కలర్ లోనూ ఉంటుంది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. గ్రీన్ జిలేబీతో చరిత్ర సృష్టించారు మన ఇండియన్స్..

ప్రపంచ వ్యాప్తంగా రోజుకొక ఈటింగ్ ఫుడ్  వైరైటీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.  ఇప్పుడు తాజాగా బెంగళూరులో తయారైన గ్రీన్ జిలేబీ  వంటకం వైరల్ అవుతోంది.  ఈ మౌంటెన్ డ్యూ జిలేబీ చాలా  ప్రత్యేకమని చెబుతున్నారు.  బీన్స్ ఉపయోగించి దీనిని తయారు చేయడం వలన ఇది ఆకుపచ్చ రంగులో ఉంది. 

భారతీయ వంటకాల్లో   జిలేబీకి ప్రత్యేక స్థానం ఉంది.  బెల్లం జిలేబీ.. పంచదార జిలేబీ ఇలా రక రకాల జిలేబీలు మార్కెట్లో దొరుకుతాయి.  ఇప్పుడు తాజాగా మౌంటెన్ డ్యూ జిలేబీ  బెంగళూరు  స్వీట్ మార్కెట్లోకి వచ్చింది.  ఇది తినేటప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి  దీనికి అవారెబెలె జిలేబి అని పేరు పెట్టారు.   ఫ్లోరోసెంట్ ఆకుపచ్చ రంగు కారణంగా మౌంటైన్ డ్యూ జలేబి అనేపేరు కూడా పెట్టారు.

అవారెబెలె జిలేబీ   చిత్రాన్ని ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి తన పోస్ట్ క్యాప్షన్‌లో డిష్ గురించి వివరించాడు. అవారెబెలె  బీన్స్ కర్ణాటకలో  బాగా ప్రాచుర్యం పొందాయి.  అవారెబెలె  ప్రత్యేకమైన రుచి కలిగి  చాలా ప్రసిద్ధి చెందింది,    అవారెబెలె జిలేబీ  పాత చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.  దానికి అంకితమైన పండుగ, జాతర కూడా ఉంది - అవరెకై మేళ," అని రాశారు.

ALSOREAD :పానీపూరీ టర్నోవర్ రూ.6 వేల కోట్లు.. అందుకే గూగుల్ సెలబ్రేషన్స్

ఫుడ్ బ్లాగర్ ప్రకారం, ఈ ప్రత్యేకమైన డెజర్ట్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉండటమే కాకుండా సాధారణ జిలేబిస్‌తో పోలిస్తే భిన్నమైన రుచిని అందిస్తుంది. వాస్తవానికి 2020లో పోస్ట్ చేసినప్పటి నుండి, ఈ చిత్రం 25వేల 900 లైక్‌లను పొందింది.   పలువురు సోషల్ మీడియా యూజర్లు ఈ  పోస్ట్‌పై  వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలోపోస్ట్ చేశారు. "వావ్... చాలా బాగుంది," అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు.