ఐబీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ 6 రెడ్‌‌‌‌ స్నూకర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ .. క్వార్టర్స్‌‌‌‌లో అద్వానీ, మెహతా

ఐబీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ 6 రెడ్‌‌‌‌ స్నూకర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ .. క్వార్టర్స్‌‌‌‌లో అద్వానీ, మెహతా

మనామ (బహ్రెయిన్‌‌‌‌): ఇండియా స్టార్‌‌‌‌ క్యూయిస్ట్‌‌‌‌ పంకజ్‌‌‌‌ అద్వానీ, ఆదిత్య మెహతా.. ఐబీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ 6 రెడ్‌‌‌‌ స్నూకర్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో క్వార్టర్‌‌‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌‌‌లో పంకజ్‌‌‌‌ 4–2తో టోమాస్ స్కాల్‌‌‌‌స్కీ (పోలెండ్‌‌‌‌)పై గెలిచాడు. మరో మ్యాచ్‌‌‌‌లో రెండో సీడ్‌‌‌‌ ఆదిత్య 4–3తో ఎహ్‌‌‌‌సాన్‌‌‌‌ రమ్జాన్‌‌‌‌ (పాకిస్తాన్‌‌‌‌)ను ఓడించాడు. 

ఏడు ఫ్రేమ్‌‌‌‌ల మ్యాచ్‌‌‌‌లో ఓ దశలో ఆదిత్య 2–3తో వెనకబడ్డాడు. అయితే తర్వాత ఫ్రేమ్‌‌‌‌ల్లో అద్భుతంగా పుంజుకున్న ఇండియన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ 71 క్లియరెన్స్‌‌‌‌లతో ఆకట్టుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌‌‌ల్లో పారస్‌‌‌‌ గుప్తా 4–1తో పాన్‌‌‌‌ ఇమింగ్‌‌‌‌ (చైనా)పై, మనన్‌‌‌‌ చంద్ర 4–2తో అహ్మద్‌‌‌‌ సైఫ్‌‌‌‌ (ఖతార్‌‌‌‌)పై గెలిచి ముందంజ వేశారు. ప్రస్తుత చాంపియన్‌‌‌‌ కమల్‌‌‌‌ చావ్లా ప్రిక్వార్టర్స్‌‌‌‌లోనే వెనుదిరిగాడు.