సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో రోజు ఆటలో భాగంగా రెండో సెషన్ లో తన వికెట్ కోల్పోయాడు. ఒక చెత్త షాట్ ఆడి తన వికెట్ కోల్పోవడంతో ఈ టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ పై విమర్శలు వస్తున్నాయి. టీ విరామం తర్వాత సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ జాన్సెన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడిన పంత్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియా పంత్ పై భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే పంత్ మాత్రమే నిర్లక్ష్యంగా షాట్ ఆడి చేజేతులా వికెట్ పోగొట్టుకున్నాడు.
ఇన్నింగ్స్ 38 ఓవర్ రెండో బంతికి ఈ సంఘటన చోటు చేసుకుంది. 7 పరుగుల వద్ద పంత్ ఔట్ కావడంతో ఇండియా 105 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో ఇండియా గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డ్రా చేసుకోవాలన్నా అద్భుతం జరగాల్సిందే. రెగ్యులర్ కెప్టెన్ గిల్ దూరం కావడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పంత్.. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవడంతో ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఔటైన తర్వాత రివ్యూ తీసుకుని డీఆర్ఎస్ ను వృధా చేశాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా విఫలమైన పంత్.. బ్యాటింగ్ లోనూ ప్రభావం చూపించలేకపోయాడు.
ప్రస్తుతం జరుగుతున్న ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 376 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో జడేజా (2), నితీష్ (8) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్మర్, జాన్సెన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మహరాజ్ కు ఒక వికెట్ దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 176 పరుగులు చేయాల్సి ఉంది. జడేజా, నితీష్, సుందర్ ఈ మాత్రం పోరాడతారో చూడాలి.
95/1 ➡️ 105/5
— Werner (@Werries_) November 24, 2025
Rishabh Pant now departs 🔥
The Proteas in a dominant position! pic.twitter.com/4aosdLsq1k
