వివాదాస్పద నిర్ణయాలు, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జ్వరానికి వాడే పారాసిటమాల్టాబ్లెట్ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ వింత వాదనచేశారు. నొప్పి తగ్గించేందుకు వాడే టైలెనాల్లో ఉండే పారాసిటమాల్‌తో ఆటిజం డెవలప్అవుతుందంటూ చెప్పడం వివాదాస్పదం అయింది. ట్రంప్ వ్యాఖ్యలపై WHO మాజీ చీఫ్సైంటిస్టు, ప్రముఖ చిన్న పిల్లల వైద్యురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్తీవ్రంగా ఖండించారు.
పారాసిటమాల్, ఆటిజానికి ఎలాంటి లింకు లేదు.. శాస్త్రీయ ఆధారాలేమి లేవు..పారాసెటమాల్ చాలా మంచి డ్రగ్ అని అనేక అధ్యయనాలు నిరూపించాయని డాక్టర్ స్వామినాథన్ అన్నారు. అంతేకాదు పారాసిటమాల్ అత్యంత సురక్షితమైన మందులలో ఒకటి.ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్రెస్టిక్స్(FIGO) పారాసిటమాల్ వాడకాన్ని సిఫార్సు చేస్తుందని చెప్పారు. వైద్యుల సూచనల మేరకు ఈ ఔషధాన్ని ఉపయోగించాలని సూచించారు. వైద్య సలహా కోసం గూగుల్‌ను సూచించవద్దని కూడా ఆమె సిఫార్సు చేశారు.
టైలెనాల్ అంటే..
టైలెనాల్ అనేది ఎసిటమినోఫెన్ బ్రాండ్ పేరు.ఇది బాగా ఉపయోగించే ఓవర్-ది- కౌంటర్ ఔషధం. ఇది నొప్పి నివారిణిగా,జ్వరం తగ్గించేదిగా బాగా పనిచేస్తుంది. ఎసిటమినోఫెన్‌ను సాధారణంగా తలనొప్పి, వెన్నునొప్పి, ఆర్థరైటిస్ చిన్న నొప్పి, పంటి నొప్పి, కండరాల నొప్పులు, ప్రీమెన్స్ట్రువల్ ,ఋతు తిమ్మిరి వంటి చిన్న నొప్పులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
ట్రంప్ ఏమన్నాడంటే..
గర్భిణీలు టెలైనాల్ వాడకుండా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఆటిజంతో ముడిపడి ఉంది. ఎసిటోమినోఫెన్ వాడకం ఆటిజం ప్రమాదాన్ని పెంచుతుందని ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ వైద్యులకు చెపుతుందని ట్రంప్ అన్నారు.
►ALSO READ | హాంకాంగ్ లో సూపర్ టైఫూన్ భయం.. ముందస్తుగా స్కూళ్లు, దుకాణాలు మూసివేత..700 విమానాలు రద్దు
