ఇవాళ్టి నుంచి పారాలింపిక్స్:15 పతకాలే లక్ష్యం

ఇవాళ్టి నుంచి పారాలింపిక్స్:15 పతకాలే లక్ష్యం
  •     గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌పై దేవేంద్ర, మరియప్పన్‌‌‌‌ గురి
  •     ఇండియా నుంచి 54 మంది బరిలో

గతంలో ఎన్నడూ లేని విధంగా టోక్యో ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌ షోను చూపెట్టిన ఇండియా.. మరో ప్రతిష్టాత్మక టోర్నీకి రెడీ అయ్యింది. మంగళవారం నుంచి జరిగే పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో పతకాల వేట కొనసాగించేందుకు సిద్ధమైంది.1972 నుంచి పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో బరిలోకి దిగుతున్న ఇండియా ఇప్పటివరకు 12 పతకాలు సాధించింది. ఇందులో 2016 రియో గేమ్స్‌‌‌‌‌‌‌‌లో రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌, ఒక సిల్వర్‌‌‌‌‌‌‌‌, ఒక బ్రాంజ్‌‌‌‌‌‌‌‌తో 43వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. అయితే ఈసారి ఆ సంఖ్యను మార్చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 5 గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో కలిపి 15 పతకాలు గెలవాలని ప్లాన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. ఇందుకోసం 54 మంది బరిలోకి దిగుతుండగా, 9 క్రీడాంశాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి చాలా దేశాలు గేమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి వైదొలిగాయి. దీంతో ఈసారి ఇండియా టాప్‌‌‌‌‌‌‌‌–25లో ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక జపాన్‌‌‌‌‌‌‌‌లో వైరస్‌‌‌‌‌‌‌‌ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. హెల్త్‌‌‌‌‌‌‌‌ ప్రొటోకాల్స్‌‌‌‌‌‌‌‌తో పాటు అన్ని రకాల సేఫ్టీ మెజర్స్‌‌‌‌‌‌‌‌ను నిర్వాహకులు తీసుకుంటున్నారు. 
టాప్‌‌‌‌‌‌‌‌లో మనోళ్లే..
రియో గేమ్స్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ దేవేంద్ర ఝఝారియా, హైజంపర్‌‌‌‌‌‌‌‌ మరియప్పన్‌‌‌‌‌‌‌‌ తంగవేలు.. ఇండియన్‌‌‌‌‌‌‌‌ బృందాన్ని ముందుండి నడిపించనున్నారు. దీనికితోడు గ్లోబల్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియన్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లే టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. నలుగురు అథ్లెట్లు తమ క్రీడాంశాల్లో నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉండగా, ఆరుగురు సెకండ్‌‌‌‌‌‌‌‌ పొజిషన్‌‌‌‌‌‌‌‌లో మరో 10 మంది నంబర్‌‌‌‌‌‌‌‌ త్రీ ర్యాంక్‌‌‌‌‌‌‌‌ల్లో ఉన్నారు. దీంతో ఇండియన్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లపై అంచనాలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. 
హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌పై దేవేంద్ర గురి..
జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రో ఎఫ్‌‌‌‌‌‌‌‌–46లో దేవేంద్ర హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌పై గురిపెట్టాడు. 2004, 2016లో పోడియం ఫినిష్‌‌‌‌‌‌‌‌ చేసిన దేవేంద్ర చిన్నతనంలో ఎలక్ట్రిక్‌‌‌‌‌‌‌‌ షాక్‌‌‌‌‌‌‌‌తో చెయ్యి కోల్పోయాడు. అయినా ఆత్మవిశ్వాసంతో పారాలింపిక్స్‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికే తనదైన ముద్ర వేశాడు. ఈ కేటగిరీలో వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌ అయిన దేవేంద్ర 40 ఏళ్ల వయసులోనూ ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతున్నాడు. చేతులు సరిగా లేని వాళ్లతో పాటు మజిల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ తక్కువగా ఉన్న  వాళ్లను ఎఫ్‌‌‌‌‌‌‌‌–46లో ఆడనిస్తారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌–64 జావెలిన్‌‌‌‌‌‌‌‌ త్రోలో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌ చౌదరి కూడా గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌పై కన్నేశాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌ ర్యాంక్‌‌‌‌‌‌‌‌తో పాటు వరల్డ్‌‌‌‌‌‌‌‌ రికార్డు హోల్డర్‌‌‌‌‌‌‌‌ కూడా కావడం అతనికి కలిసొచ్చే అంశాలు. ఎఫ్‌‌‌‌‌‌‌‌–41లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ అయిన సుందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ గుర్జార్‌‌‌‌‌‌‌‌, అజిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌–46), నవ్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (ఎఫ్‌‌‌‌‌‌‌‌–41) కూడా పతకాలపై ఆశలు పెట్టుకున్నారు.
బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌.. తొలిసారి
మెన్స్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌–3 బ్యాడ్మింటన్​ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో వరల్డ్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌, మల్టీపుల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ప్రమోద్‌‌‌‌‌‌‌‌ భగత్‌‌‌‌‌‌‌‌.. గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ రేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ సెకండ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ (ఎస్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌6), తరుణ్‌‌‌‌‌‌‌‌ దిల్లాన్‌‌‌‌‌‌‌‌ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌–4) కూడా మెరుగైన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆశిస్తున్నారు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ కేటగిరీలో పారుల్‌‌‌‌‌‌‌‌ పర్మార్‌‌‌‌‌‌‌‌, పాలక్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ (ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌3–ఎస్‌‌‌‌‌‌‌‌ఎయూ 5) మెడల్స్‌‌‌‌‌‌‌‌పై కన్నేశారు. ఆర్చరీలో రాకేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, శ్యామ్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ (కాంపౌండ్‌‌‌‌‌‌‌‌), వివేక్‌‌‌‌‌‌‌‌ చికారా, హర్విందర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (రికర్వ్‌‌‌‌‌‌‌‌), విమెన్స్‌‌‌‌‌‌‌‌లో జ్యోతి బలియాన్‌‌‌‌‌‌‌‌ (కాంపౌండ్‌‌‌‌‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌‌‌‌‌/ మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌)పై భారీ ఆశలు ఉన్నాయి. పారా షూటింగ్‌‌‌‌‌‌‌‌, పారా కనోయింగ్‌‌‌‌‌‌‌‌, పారా స్విమ్మింగ్‌‌‌‌‌‌‌‌, పారా పవర్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌, పారా టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌, పారా తైక్వాండోలో కూడా ఇండియన్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లు తమ అదృష్టాన్నీ పరీక్షించుకోనున్నారు. 
సూపర్‌‌‌‌‌‌‌‌ జంపర్‌‌‌‌‌‌‌‌..
ఐదేళ్ల వయసులో బస్‌‌‌‌‌‌‌‌ యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌లో  కుడి కాలు కోల్పోయిన మరియప్పన్‌‌‌‌‌‌‌‌ తంగవేల్‌‌‌‌‌‌‌‌.. టీ–63 హైజంప్‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌. రియోలో గెలిచిన గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను కంటిన్యూ చేయాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నాడు. వరల్డ్‌‌‌‌‌‌‌‌ ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో సెకండ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉండటంతో అతనిపై అంచనాలు పెరిగాయి. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీలో ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌ బేరర్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు.