అర్జున్ అంబటి హీరోగా పూరి జగన్నాథ్ శిష్యుడు నాగ శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పరమపద సోపానం’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. గణపర్తి నారాయణరావు, తేలప్రోలు ప్రసన్న నిర్మిస్తున్నారు. పులగం సుప్రియ కో ప్రొడ్యూసర్. ఏప్రిల్ 24న సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను లాంచ్ చేసిన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘ట్రైలర్ చూశా.
చాలా ఆసక్తికరంగా, గ్రిప్పింగ్‌గా ఉంది. మంచి థ్రిల్లర్ రాబోతోందనే ఎక్సయిట్మెంట్ క్రియేట్ చేసింది. దర్శకుడు నాగ శివ చాలా కాలంగా పరిచయం. ఈ సినిమాతో హీరోగా అర్జున్ అంబటి, దర్శకుడిగా నాగ శివ పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నా’ అంటూ బెస్ట్ విషెస్ చెప్పారు. ఇక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఓ సోషల్ ఇష్యూను టచ్ చేస్తూ యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

