టెన్త్ ఎగ్జామ్స్ ను ఏప్రిల్ లాస్ట్ వీక్ కు మార్చాలి

టెన్త్  ఎగ్జామ్స్ ను ఏప్రిల్ లాస్ట్ వీక్ కు మార్చాలి

హైదరాబాద్, వెలుగు: ఎండలు తీవ్రంగా ఉండే మే నెలలో పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తారని టీచర్లు, పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల రీషెడ్యూల్ నేపథ్యంలో టెన్త్​ఎగ్జామ్స్ ను మే చివరి వారానికి మార్చిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మార్చిలోనే ఎండలు మండిపోతుంటే మేలో ఇంకెలా ఉంటుందో అని కంగారు పడుతున్నారు. పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసి ఏప్రిల్ చివరి వారానికి మార్చాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఈ నెల 22న ట్రస్మా సభ్యులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేసింది. హైదరాబాద్​ స్కూల్స్​పేరెంట్స్​అసోసియేషన్(హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌పీఏ) సభ్యులు కూడా మంత్రిని కలవనున్నారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇంటర్ పరీక్షలతో లింకేంది?

ప్రభుత్వం ఏటా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. పరీక్షల టైంలో సెంటర్ల గందరగోళం ఉండకూడదనే ఇలా పెడుతోంది. ఎప్పట్లాగే ఈసారి కూడా ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాకనే టెన్త్ విద్యార్థులకు నిర్వహిస్తామని విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్​చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. జాతీయ స్థాయిలో జరిగే జేఈఈ పరీక్షల షెడ్యూల్​తో క్లాష్ కాకుండా ఉండేందుకు ఇంటర్ పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటించింది.

మే 6 నుంచి ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మే 7 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. దీంతో టెన్త్​ ఎగ్జామ్స్​ను మే 23 నుంచి 28వరకు నిర్వహించాలని ప్రభుత్వం రీషెడ్యూల్​చేసింది. అయితే ఇంటర్ తర్వాతే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనే నిబంధన లేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చెబుతోంది. మే నెలాఖరుకు వాయిదా వేయాల్సిన అవసరం ఏముందని ఉపాధ్యాయ సంఘాలు, స్కూల్ యాజమాన్యాలు, పేరెంట్స్ అసోసియేషన్లు ప్రశ్నిస్తున్నాయి. 

ఎండలు ముదిరే టైంలో..

రీషెడ్యూల్ ప్రకారం మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు స్టార్ట్​అవుతాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మార్చి నెలలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో పేరెంట్స్, టీచర్స్​ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సిటీలో 35 నుంచి 38 మధ్య టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు జనాలు జంకుతున్నారు. మేలో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఆ టైంలో పిల్లలు పరీక్షలు ఎలా రాస్తారని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు. 

అంతకన్నా ముందే పెట్టాలి

ఈ సారి సిలబస్​ని 70 శాతం తగ్గించారు. పరీక్షల్లోనూ 50 శాతం మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే సిలబస్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పిల్లలు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షలకు ఎక్కువగా గ్యాప్ ఇవ్వకుండా ఏప్రిల్ చివరి వారంలో పెట్టాలని కోరుతున్నాం. మేలో స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. 
- రాజభాను, ప్రెసిడెంట్, హెడ్‌‌‌‌ మాస్టర్స్ అసోసియేషన్

పేరెంట్స్​ భయపడుతున్నారు

ప్రభుత్వం నిర్ణయంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒంటిపూట బడికే చాలామంది వెనకడుగు వేస్తున్నారు. అలాంటిది మేలో టెన్త్​ఎగ్జామ్స్ అంటుంటే భయపడిపోతున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ చివరి వారంలో ఎగ్జామ్స్​పెడితే బాగుంటుంది. స్కూళ్ల ఫీజులు, ఎగ్జామ్స్​రీ షెడ్యూల్ విషయమై విద్యాశాఖ మంత్రిని కలుస్తాం.
- వెంకట్ సాయినాథ్, జాయింట్ సెక్రెటరీ, హెచ్ఎస్‌‌‌‌పీఏ

మంత్రిని కలిసి రిక్వెస్ట్ చేశాం

పదో తరగతి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని, మే నెల కంటే ముందే నిర్వహించాలని ఈ నెల 22న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిని కలిసి రిక్వెస్ట్ చేశాం. పాజిటివ్ గానే స్పందించారు. ఈ విషయమై చీఫ్​సెక్రెటరీ, ఎడ్యుకేషన్ సెక్రెటరీని కలుస్తాం. - యాదగిరి శేఖర్ రావ్ (స్టేట్ ప్రెసిడెంట్, ట్రస్మా)