Family Time : ఆ ఎఫెక్ట్ పిల్లలపై పడనివ్వొద్దు

Family Time : ఆ ఎఫెక్ట్ పిల్లలపై పడనివ్వొద్దు

భార్యాభర్తలు విడిపోతే ఆ ఎఫెక్ట్ పిల్లలపైనే ఎక్కువగా పడుతుంది. ఆ టైంలో పేరెంట్స్ వాళ్ల సమస్యలతో సతమతమవుతూ పిల్లల ఎమోషన్స్, ఫీలింగ్స్ ని పట్టించుకోరు. దానివల్ల పిల్లలు ఒంటరిగా ఫీలయ్యే అవకాశం ఉంది. ఎదుటివాళ్ల పిల్లల పేరెంట్స్ తో పోల్చుకుంటూ డిప్రెషన్లోకి వెళ్తారు కూడా. వాళ్ల ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని కూడా బయటికి చెప్పరు. 

అందువల్ల విడిపోయాక పేరెంట్స్ వాళ్ల ప్రాబ్లమ్ ని పక్కనపెట్టి పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. వాళ్లకున్న ప్రశ్నలు తెలుసుకుని ఓపిగ్గా సమాధానం చెప్పాలి. వాళ్లకు సంతోషాన్నిచ్చే పనులు చేయాలి. కలిసి బయటకి వెళ్లడం లాంటివి చేస్తే పార్టనర్ తో రిలేషన్ ఎలా ఉన్నా.. ఆ ఎఫెక్ట్ పిల్లలపై పడదు. అలాగే పేరెంట్స్ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా అవి పిల్లల ముందు చూపించకూడదు. వాళ్లకి తల్లిదండ్రులిద్దరి ప్రేమ అవసరం. అందువల్ల ఇద్దరూ కలిసి వాళ్లని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయాలి.

ALSO READ :- ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కేసులు దాడులు!.. చెన్నూర్​లో బాల్క సుమన్ అనుచరుల అరాచకాలు