వైభవ్తో టూర్కు వెళ్లనున్న తల్లిదండ్రులు.. ఖర్చులు భరించనున్న బీసీసీఐ

వైభవ్తో టూర్కు వెళ్లనున్న తల్లిదండ్రులు.. ఖర్చులు భరించనున్న బీసీసీఐ

ముంబై: బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తల్లిదండ్రులు జాతీయ జట్టు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలలో అతడితో పాటు వెళ్లనున్నారు. బ్రిటన్ లో వారి ప్రయాణ, వసతి ఖర్చులను బీసీసీఐ భరించనుంది. 

రాజస్తాన్ రాయల్స్ తరపున ఇటీవల ఐపీఎల్ సీజన్‌‌లో అద్భుత ప్రదర్శన చేసిన 15 ఏళ్ల సూర్యవంశీని శనివారం ప్రకటించిన భారత టీ20 జట్టులోకి ఎంపిక చేశారు. " ఆ బోర్డింగ్, వసతి ఖర్చులను బోర్డే చూసుకుంటుంది. అంత చిన్న వయసు ఉన్న అబ్బాయి పక్కన కుటుంబం ఉండడం చాలా కీలకమని మేము భావిస్తున్నాము" అని బీసీసీఐ అధికారి తెలిపారు. 

భారత జట్టు మొదట ఐర్లాండ్ పర్యటనలో భాగంగా జూన్ 26, 28 తేదీల్లో బెల్ఫాస్ట్‌‌లో రెండు టీ20 మ్యాచ్‌‌లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి అక్కడ ఐదు టీ20లు, 3 వన్డే మ్యాచ్‌‌లు ఆడుతుంది. 

ఈ యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ జపాన్‌‌లో జరిగే ఆసియా క్రీడల భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. సూర్యవంశీ ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నాడు. అక్కడ అఫ్గానిస్తాన్‌‌తో కలిసి జరిగే వన్డే త్రైపాక్షిక సిరీస్‌‌లో పోటీ పడబోయే 'భారత్-ఏ' జట్టు తరపున అతడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.