లక్ష్మీదేవిపల్లి ఫ్యాక్టరీలో పేలుడు ..ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

లక్ష్మీదేవిపల్లి ఫ్యాక్టరీలో పేలుడు ..ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

పరిగి, వెలుగు: పరిగి మండలం లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి పేలుడు సంభవించి ఒకరు చనిపోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఫర్నేస్ (మెషీన్​)పేలి అక్కడ పని చేస్తున్న ఆలీ, రషీద్​కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని సోమాజిగూడలోని ప్రైవేట్​దవాఖానకు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆలీ చనిపోగా, రషీద్​చికిత్స పొందుతున్నాడు. దీనిపై పోలీసులు విచారణ జరిపి గురువారం ధర్మరాజ్, చందన్ రైపై కేసు నమోదు చేశారు. నిందితులు ప్రొసీజర్​ ప్రకారం పని చేయకపోవడం వల్లే పేలుడు సంభవించిందని పరిగి ఎస్సై మోహన్ కృష్ణ తెలిపారు.