
పరిగి మీదుగా వికారాబాద్ వెళ్లే బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. వాగుపై ఈ బ్రిడ్జి ఉండగా.. సిమెంట్ పోయి కంకర తేలుతోంది. అయినా భారీ వాహనాలు ఈ బ్రిడ్జి మీదుగా వెళ్తుండడంతో కుంగిపోతోంది. ఇప్పటికే కొంత ధ్వంసమైంది. దీంతో ఇటుగా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.