
- రాత్రి 8 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో
దుబాయ్: ఓ వైపు హ్యాండ్‌షేక్ వివాదం.. మరోవైపు ప్లేయర్ల చెత్త పెర్ఫామెన్స్.. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో పాకిస్తాన్ కీలక మ్యాచ్‌కు రెడీ అయ్యింది. గ్రూప్–ఎలో బుధవారం జరిగే మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో తలపడనుంది. ఇందులో గెలిస్తే సూపర్–4 స్టేజ్‌కు చేరుతుంది. కాబట్టి ఆఫ్ ఫీల్డ్ వ్యవహారాలను పక్కనబెట్టి ఆన్ ఫీల్డ్‌పై దృష్టి పెట్టాలని పాక్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పాక్ ఒకటి గెలిచి మరోటి ఓడింది. యూఏఈ పరిస్థితి కూడా సేమ్. ప్రస్తుతం యూఏఈ నెట్ రన్‌రేట్ -–2.03గా ఉంటే పాక్ 1.64తో బెటర్‌గా ఉంది. అయితే ఇండియా చేతిలో ఓటమితో పాక్ జట్టులో కాస్త ఆందోళన కనిపిస్తోంది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్, వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు యూఏఈ కూడా ఇదే అస్త్రాన్ని ప్రయోగించబోతున్నది. ఇది విజయవంతమైతే సూపర్–4లో అడుగుపెట్టొచ్చని భారీ ఆశలు పెట్టుకుంది. దీన్ని అడ్డుకోవాలంటే పాక్ బ్యాటర్లు సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, హసన్ నవాజ్ గాడిలో పడాలి.
పేసర్ షాహీన్ ఆఫ్రిదిపై అంచనాలు ఎక్కువగా ఉన్నా అభిషేక్ శర్మ, సూర్యకుమార్ ఉతుకుడు చూసిన తర్వాత అభిప్రాయం మారింది. లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఫర్వాలేదనిపించినా.. మొహమ్మద్ నవాజ్, సుఫియాన్ ముఖీమ్ ఫెయిల్ కావడం మైనస్‌గా మారింది. ఇక టీమిండియా లెవెల్లో ఆడే సత్తా లేకపోయినా తమదైన రోజున యూఏఈ కూడా సంచలనం చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. ఒమన్‌పై 42 రన్స్ తేడాతో గెలవడం వాళ్లకు కాన్ఫిడెన్స్ పెంచే అంశం. కెప్టెన్ మొహమ్మద్ వసీమ్, అలీషాన్ షరాఫుకు టీ20 ఎక్స్‌పీరియెన్స్ ఎక్కువ. ఆత్మ విశ్వాసం లోపించి ఉన్న పాక్‌ను వేటాడేందుకు యూఏఈ బౌలర్లు కూడా రెడీగా కాచుకుని ఉన్నారు. జునైద్ సిద్ధిక్, స్పిన్నర్ హైదర్ అలీకి తోడుగా ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిత్ మద్దతుగా నిలిస్తే సంచలనం ఖాయం.