ఓలా @ 10 లక్షల బండ్లు.. నాలుగేళ్లలోనే ఈ మైలురాయిని అందుకున్న కంపెనీ

ఓలా @ 10 లక్షల బండ్లు.. నాలుగేళ్లలోనే ఈ మైలురాయిని అందుకున్న కంపెనీ

న్యూఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్ తన పది లక్షలవ వాహనాన్ని తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్ నుంచి విడుదల చేసింది. 2021లో ఉత్పత్తి ప్రారంభించిన ఈ కంపెనీ, నాలుగు సంవత్సరాల్లోనే పది లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లను తయారు చేయగలిగింది. ఎస్‌‌1, తాజాగా లాంచ్ చేసిన రోడ్‌‌స్టర్‌‌‌‌ఎక్స్ బైక్‌‌లకు డిమాండ్ ఉండడంతో ఈ మైలురాయిని చేరుకుంది.

ఈ సందర్భంగా స్పెషల్ ఎడిషన్ రోడ్‌‌స్టర్ఎక్స్‌‌+ బైక్‌‌ను లాంచ్ చేసింది. దీనిని మిడ్‌‌నైట్ బ్లూ కలర్‌‌‌‌తో తీసుకొచ్చింది.   ఓలా ‘వన్‌‌ ఇన్ ఏ మిలియన్’’ క్యాంపెయిన్‌‌ను ప్రారంభించింది.  వినియోగదారులను తమ మధురమైన ప్రయాణాలను పంచుకోవాలని ఆహ్వానిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో ఆకట్టుకున్నవారికి  ప్రత్యేక రోడ్‌‌స్టర్ఎక్స్‌‌+ బైక్‌‌ను  బహుమతిగా ఇస్తారు.