ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–4కు చేరుకున్న.. టీమిండియాలో ఒక్క మార్పు.. బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌!

ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–4కు చేరుకున్న.. టీమిండియాలో ఒక్క మార్పు.. బుమ్రాకు రెస్ట్‌‌‌‌‌‌‌‌!

దుబాయ్‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–4కు చేరుకున్న టీమిండియా.. ఒమన్‌‌‌‌‌‌‌‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌కు తుది జట్టులో ఒక్క మార్పు చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉంది. స్పీడ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌‌‌‌‌ బుమ్రాకు ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని భావిస్తున్నారు. సూపర్‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న మిగతా జట్టులో ఎలాంటి మార్పులు చేయొద్దని యోచిస్తున్నారు. ఈ నెల 21, 24, 26 తేదీల్లో ఇండియా వరుసగా సూపర్‌‌‌‌‌‌‌‌–4 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడనుంది. 

ఒకవేళ ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరితే వారం రోజుల్లో నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి పడకుండా చూడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాబోయే మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల కోసం బుమ్రాను తాజాగా బరిలోకి దించాలని భావిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఆడకపోతే అతని ప్లేస్‌‌‌‌‌‌‌‌లో అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌, హర్షిత్‌‌‌‌‌‌‌‌ రాణాలో ఒకరికి చాన్స్‌‌‌‌‌‌‌‌ దక్కనుంది. ఒమన్‌‌‌‌‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో బ్యాటర్లు కూడా మరింత దూకుడును చూపెట్టేందుకు రెడీ అవుతున్నారు.