బిల్డింగ్ పైకెక్కి కాంట్రాక్టర్ నిరసన.. మూడు నెలల బిల్లు ఇవ్వలేదని ఆందోళన

బిల్డింగ్ పైకెక్కి కాంట్రాక్టర్ నిరసన.. మూడు నెలల బిల్లు ఇవ్వలేదని ఆందోళన

మెదక్, వెలుగు : మూడు నెలల బిల్లు ఇవ్వడం లేదని కాంట్రాక్టర్ శ్రీనివాస్ మంగళవారం మెదక్ టౌన్ లోని గురుకుల పాఠశాల బిల్డింగ్ పైకెక్కి నిరసన తెలిపారు.   ఫ్రూట్స్ కాంట్రాక్టర్ అయిన తాను యాక్సిడెంట్ కావడం వల్ల మధ్యలోనే ఫ్రూట్స్ సరఫరా నిలిపేశానని చెప్పారు. గత జూన్ లో వడ్డీలకు అప్పులు తెచ్చి రూ. 45 వేలతో టెండర్ వేశానని చెప్పాడు. 

టెండర్ డబ్బులు, మూడు నెలలు ఫ్రూట్స్ సరఫరా చేసిన బిల్లులు ఇప్పించాలని కోరారు. కలెక్టర్ రాహుల్ రాజ్  స్కూల్ ఇన్​చార్జ్   ప్రిన్సిపాల్ కు చెప్పినా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు  ఘటనా స్థలానికి వెళ్లి కాంట్రాక్టర్ కు నచ్చజెప్పి కిందికి దించి పీఎస్​కు తరలించారు. 

ఘటనపై ఇన్​చార్జ్ ప్రిన్సిపాల్ పద్మావతిని వివరణ కోరగా.. మూడు నెలల బిల్లులు ఈ కుబేర్ యాప్ ద్వారా కాంట్రాక్టర్ అకౌంట్ లో జమ అయ్యాయని తెలిపారు. టెండర్ డిపాజిట్ డబ్బులు మాత్రం డిపార్ట్ మెంట్ గైడ్ లైన్స్ మేరకు తిరిగి ఇవ్వడానికి వీలులేదని చెప్పారు.