
చైతన్యరావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీషన్ లీడ్ రోల్స్‌లో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న చిత్రం ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను యాంకర్ సుమ రిలీజ్ చేసింది. ‘కేక్ కట్ చేసేటప్పుడు లైట్స్ ఆర్పుతారట, మళ్ళీ లైట్స్ వేసేలోపు కేక్‌తో పాటు వాళ్ళ ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అంటూ కిడ్నాప్ ప్లాన్‌ని సునీల్ తన గ్యాంగ్‌తో చెబుతుండగా మొదలైన ట్రైలర్ హిలేరియస్‌గా సాగింది.
‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ అనే ట్యాగ్‌లైన్‌ని జస్టిఫై చేస్తూ ఇందులో చూపించిన సీన్స్ ప్రేక్షకులకు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. యాక్షన్, డ్రామా, ఫన్ సహా అన్ని ఎలిమెంట్స్‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. ఏప్రిల్ 19న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.