ఇరాన్ నిరసనకారులకు సంఘీభావంగా ఈఫిల్ టవర్‌పై వెలుగులు

ఇరాన్ నిరసనకారులకు సంఘీభావంగా ఈఫిల్ టవర్‌పై వెలుగులు

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు సంఘీభావంగా ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్ నగరంలో వేలాది మంది ప్రజలు మార్చ్ నిర్వహించారు. ఐకానిక్ ఈఫిల్ టవర్ కూడా ఉద్యమంలో భాగమైంది. తమ హక్కుల కోసం ఇరాన్ మహిళలు గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతుగా ఫ్రాన్స్ ప్రజలు నినాదాలు చేశారు.

నిరనసలో భాగంగా ఈఫిల్ టవర్ లైట్లతో వెలిగిపోయింది.  "విమెన్ లైఫ్ ఫ్రీడమ్", "స్టాప్ ఎగ్జిక్యూషన్స్ ఇన్ ఇరాన్" అనే స్లోగన్స్ తో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. హిజాబ్‌ సరిగా ధరించనందుకు 2022 సెప్టెంబర్ లో భద్రతాదళాల కాల్పుల్లో చనిపోయిన 22 ఏళ్ల యువతీ మహసా అమినికి ఈఫిల్ టవర్ వద్ద నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఈఫిల్ టవర్ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.