సైనికుల వెంటే ఉన్నామని సందేశం పంపాలి: మోడీ

సైనికుల వెంటే ఉన్నామని సందేశం పంపాలి: మోడీ

న్యూఢిల్లీ: మాన్‌‌సూన్ పార్లమెంట్ సమావేశాలకు హాజరవ్వడం ద్వారా ఎంపీలు తమ బాధ్యతను నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమైన సమస్యలపై సెషన్‌‌లో చర్చ జరుగుతుందని భావిస్తున్నామని చెప్పారు. ఉద్విగ్న పరిస్థితుల్లో సరిహద్దుల వద్ద పహారా కాస్తున్న వీర సైనికుల తరఫున మొత్తం దేశం నిలిచిన వేళ.. పార్లమెంట్ ముక్త కంఠంతో ఈ సందేశాన్ని పంపాలన్నారు. మహమ్మారి ఇంకా విజృంభిస్తున్నప్పటికీ పార్లమెంట్ సభ్యులు సమావేశాలకు హాజరవ్వాలని నిర్ణయించుకోవడం భేష్ అన్నారు. ‘ఎంపీలకు అభినందనలు. అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈసారి లోక్‌‌సభ, రాజ్యసభ సమావేశాలు వైవిధ్య సమయంలో జరుగుతున్నాయి. అందుకే శనివారం, ఆదివారం కూడా సెషన్ కొనసాగుతుంది. దీనికి ఎంపీలు తమ సమ్మతి తెలిపారు’ అని మోడీ పేర్కొన్నారు.