లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించడంతో ట్విట్టర్‌ క్రిమినల్‌ నేరానికి పాల్పడింది

లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించడంతో ట్విట్టర్‌ క్రిమినల్‌ నేరానికి పాల్పడింది

లడఖ్‌ను చైనాలో భాగంగా తెలిపడంపై పార్లమెంటరీ పానెల్‌కు ట్విట్టర్‌ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని.. ఈ చర్యను ఏడేళ్ల జైలుశిక్ష విధించే నేరంగా పరిగణించవచ్చన్నారు కమిటీ చైర్మన్‌ మీనాక్షి లేఖి. డేటా ప్రొటెక్షన్‌ బిల్‌, 2019 కింద జరిగిన విచారణకు ట్విట్టర్‌ ప్రతినిధులు హాజరయ్యారని, వారిని విచారించినట్లు ఆమె తెలిపారు. లడఖ్‌ను చైనాలో భాగంగా చూపడంపై ట్విట్టర్‌ ఇచ్చిన వివరణ సరిపోదని కమిటీ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చిందని ఆమె అన్నారు. భారత్‌ భావనలను సోషల్‌ మీడియా గౌరవిస్తుందని ట్విట్టర్‌ చెప్పిందని అయితే ఇది భావనలకు సంబంధించిన అంశం కాదని, సౌభ్రాతృత్వం, సమానత్వానికి సంబంధించిన అంశమని ఆమె అన్నారు. లడఖ్‌ను చైనాలో భాగంగా చూపించడంతో ట్విట్టర్‌ క్రిమినల్‌ నేరానికి పాల్పడిందని.. ఏడేళ్ల జైలుశిక్ష విధించవచ్చని మీనాక్షిలే తెలిపారు.