
సెప్టెంబర్ 14వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ ఒకటవ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం 9 గంటలకు దిగువ సభలో సమావేశం కావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలిపినట్లు లోక్‌సభ సెక్రటేరియేట్ తన నోటిఫికేషన్‌లో చెప్పారు. అదే రోజున రాజ్యసభ కూడా మరో సమయంలో సమావేశం అవుతుంది. కరోనా నిబంధనల ప్రకారం రెండు సభలకు చెందిన ఎంపీలు ఒక దగ్గర కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిఫారసు చేసింది.