
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజే.. లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. తొలుత పహల్గాం టెర్రర్ అటాక్, ఎయిరిండియా విమాన ప్రమాద మృతులకు ఉభయ సభలు నివాళులర్పిం చాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ మొదలవ్వగానే ప్రతిపక్ష పార్టీల సభ్యులందరూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు.
ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడి, సీజ్‌ఫైర్‌పై ట్రంప్ ప్రకటన, నిరుద్యోగంతో పాటు పలు అంశాలపై చర్చించాలని పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకె ళ్లేందుకు ప్రయత్నించారు. స్పీకర్ ఓం బిర్లా కల్పించుకుని.. క్వశ్చన్ అవర్ తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పినా పట్టించుకోలేదు. సభ నియమనిబంధనలు పాటించాలని, నినాదాలు చేసేదుంటే బయటి కెళ్లి చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు