కార్యకర్తల అభిప్రాయం మేరకే పదవులు .. ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిబంల్కర్

కార్యకర్తల అభిప్రాయం మేరకే పదవులు ..    ఏఐసీసీ అబ్జర్వర్ అంజలి నిబంల్కర్

కూకట్​పల్లి, వెలుగు: పార్టీ పట్ల అంకితభావంతో, ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసినవారే కాంగ్రెస్​లో నాయకులుగా ఎదుగుతారని ఏఐసీసీ అబ్జర్వర్​అంజలి నిబంల్కర్​అన్నారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఏ స్థాయి నాయకులకైనా పదవులు వస్తాయని తెలిపారు. మంగళవారం మూసాపేటలోని ఓ ఫంక్షన్​హాల్​లో పార్టీ కూకట్​పల్లి నియోజకవర్గ ఇన్​చార్జి, పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేశ్​అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు ఏఐసీసీ ప్రతినిథిగా వచ్చి కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తున్నట్లు చెప్పారు. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం, బూత్ స్థాయి వరకు కాంగ్రెస్​కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

జిల్లా ప్రస్తుత అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్​రెడ్డి మాట్లాడుతూ.. తనకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం నిరంతరం పని చేస్తానన్నారు. నాయకులు సత్యం శ్రీరంగం, పట్లోళ్ల నాగిరెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, తూము వేణు, బాలజీ, పుష్పారెడ్డి, శేరి సతీశ్​రెడ్డి, తూము వినయ్​కుమార్, లక్ష్మయ్య, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు.