కష్టపడి పని చేసిన వారికే పార్టీ పదవులు..టీపీసీసీ పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి

కష్టపడి పని చేసిన వారికే పార్టీ పదవులు..టీపీసీసీ పరిశీలకుడు జంగా రాఘవరెడ్డి

బెల్లంపల్లి, వెలుగు: కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండా పట్టుకుని పనిచేసిన వారికే సంస్థాగతంగా పదవులు వస్తాయని టీపీసీసీ పరిశీలకుడు, రాష్ట్ర కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ అండ్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఆవరణలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

  పార్టీ పదవులు ఆశించే నేతలు గ్రామ, మండల, బ్లాక్, పట్టణ స్థాయి పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వారి విన్నపాలను పార్టీ అధిష్టానానికి నివేదిస్తామన్నారు.  పీసీసీ, ఏఐసీసీ ఆదేశాల మేరకే పార్టీ పదవులు దక్కుతాయన్నారు. అనంతరం రాహుల్, రేవంత్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ సమావేశంలో  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, టీపీసీసీ సభ్యులు రాంభూపాల్, చిలుముల శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్  సూరిబాబు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.