శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. గురువారం (మే 8వ తేదీన) మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి గోవాకు వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ ఏషియా విమాన సంస్థపై ప్యాసింజర్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలింతకు ఫ్లైట్ వస్తుందా..? రాదా..? అంటూ సంబంధిత అధికారులను నిలదీశారు. ప్రస్తుతం విమానం సమయానికి వస్తుందా..? రాదా..? అనే గందరగోళంలో పడ్డారు గోవాకు వెళ్లాల్సిన ప్యాసింజర్స్.