పాటకు ప్రాణం ప్రారంభం

పాటకు ప్రాణం ప్రారంభం

సుదర్శన్, సాత్విక జంటగా హేమల్ తుమ్మపూడి తెరకెక్కించనున్న చిత్రం ‘పాటకు ప్రాణం’. తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, అనితా చౌదరి, రఘు కారుమంచి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ఓపెనింగ్‌‌‌‌ బుధవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్స్‌‌‌‌లో జరిగింది.  హీరో నిఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి ముఖ్య​అతిథులుగా హాజరై టీమ్‌‌‌‌కు బెస్ట్‌‌‌‌ విషెస్ చెప్పారు.  అనంతరం దర్శకనిర్మాత హేమల్ తుమ్మపూడి మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో సంగీతానికి, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కిస్తున్న న్యూ ఏజ్‌‌‌‌ మ్యూజికల్ డ్రామా ఇది.

శేఖర్ చంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు.  ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్‌‌‌‌ చేస్తున్నాం’ అని చెప్పారు.  ఒక పాతతరం సంప్రదాయ సంగీత విద్వాంసుడికి, ఈ తరం జెన్‌‌‌‌-Z సంగీతకారుడి మ్యూజికల్‌‌‌‌ జర్నీని ఇందులో చూపించబోతున్నారని నటుడు తనికెళ్ల భరణి చెప్పారు.  హీరోహీరోయిన్స్‌‌‌‌ సుదర్శన్ వంగల, సాత్విక,  నటీనటులు రాజీవ్ కనకాల,  అనితా చౌదరి,  నిర్మాత శ్రీరామ్ తుమ్మపూడి, డీఓపీ సంజీత్ సింగ్,  ఎడిటర్ ప్రభాత్ రెడ్డి పాల్గొన్నారు.