సొంత ఖర్చులతో  మినరల్ వాటర్ ప్లాంట్

సొంత ఖర్చులతో  మినరల్ వాటర్ ప్లాంట్

పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో కౌన్సిలర్ ఈశ్వరమ్మ తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.

ఆదివారం పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొటె సుమలతతో కలిసి ప్లాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం అత్యంత అవసరమని, కౌన్సిలర్ ఈశ్వరమ్మ సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.