ఏప్రిల్ 6న పాటపై తూటా

ఏప్రిల్ 6న పాటపై తూటా

ఖైరతాబాద్, వెలుగు :  గద్దర్​ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘పాటపై తూటా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సీనియర్​జర్నలిస్ట్​పాశం యాదగిరి, నిర్వాహకుడు సూర్యకిరణ్​తెలిపారు. సోమవారం ప్రెస్​క్లబ్​లో వారు మీడియాతో మాట్లాడారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్​పై కాల్పులు జరిగాయని గుర్తుచేశారు.

ఆ ఘటనను గుర్తుచేస్తూ యేటా ‘భావ ప్రకటన– పాలకుల అణిచివేత – గాయపడ్డ పాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని గద్దర్​అభిమానులందరూ హాజరుకావాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్ ప్రభంజన్​యాదవ్, డాక్టర్ సంగంరెడ్డి పృథ్వీరాజ్​యాదవ్, రఫీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమ పోస్టర్​ను ఆవిష్కరించారు.