- టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు చెందిన 365 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి పంపిణీ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ప్రోగ్రాంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
