ముల్లాన్‌పూర్: టీమిండియా ఫ్యాన్‌కు గుడ్ న్యూస్. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. అఫ్గానిస్తాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్లో బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు వీళ్లిద్దరు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్ (సీవోఈ) క్లియరెన్స్ ఇచ్చింది.
తొడ కండరాల గాయంతో రోహిత్, వెన్ను నొప్పితో హార్దిక్.. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత ఐదు రోజుల నుంచి సీవోఈలో రిహాబిలిటేషన్‌లో ఉన్న ఈ ఇద్దరికి స్పోర్ట్స్ సైన్ నిపుణులు ఫిట్‌నెస్ పరీక్షను నిర్వహించారు. హార్దిక్ పది ఓవర్లు బౌలింగ్ చేశాడు.
